భోజనం కోసం కష్టాలు పడితే.. మా రెస్టారెంట్ కి వెళ్లి ఫ్రీగా తినండి : Sundeep Kishan

by Prasanna |   ( Updated:2024-10-22 12:41:21.0  )
భోజనం కోసం కష్టాలు పడితే.. మా రెస్టారెంట్ కి వెళ్లి  ఫ్రీగా తినండి : Sundeep Kishan
X

దిశ, వెబ్ డెస్క్ : మన తెలుగు హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోకి వివాహ భోజనంబు అనే రెస్టారెంట్స్ ఉన్న విషయం మనకీ తెలిసిందే.

అయితే, ప్రతి బ్రాంచ్ నుంచి రోజూ ఫ్రీగా 50 మందికి ఫుడ్ ను పంపిస్తున్నాడు. ఆకలి అన్న ప్రతీ పేదవాడికి , ఆశ్రమాలకు తన ఏడు రెస్టారెంట్స్ నుంచి రోజూ 350 మందికి రోజూ ఫ్రీగా ఫుడ్ ను పెడుతున్నాడు.

అయితే, తాజాగా సందీప్ కిషన్ దీనిపై ట్వీట్ చేశాడు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు టీమ్ పేదలకు ఫుడ్ పంచుతున్న ఫొటోలు షేర్ చేసి.. " వివాహ భోజనంబు టీం చేస్తున్న పనికి నేను గర్వపడుతున్నాను. మీలో ఎవరైనా భోజనం కోసం కష్టపడితే మీ దగ్గర్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ కి నేరుగా వెళ్లి ఫుడ్ ప్యాకెట్ ని ఉచితంగా తీసుకోండి" అంటూ ట్వీట్ చేసాడు. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్, నెటిజన్లు సందీప్ ని అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed