- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వల్లే వారికి టిక్కెట్లు ఇవ్వలేదు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తన వల్లే ఎంపీల వారసులకు టికెట్లు ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారసత్వ రాజకీయాలపై మంగళవారం బీజేపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాలా మంది ఎంపీలు, పార్టీ నాయకులు ఇటీవల ముగిసిన ఎన్నికలలో తమ పిల్లలకు టికెట్లు కోరారు. వారిలో చాలామందికి నిరాకరించాము. బీజేపీ ఎంపీల పిల్లలెవ్వరికీ టిక్కెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అవి వారసత్వ రాజకీయాల కిందికి వస్తాయి. నా వల్లే వారికి టిక్కెట్లు అందలేదు' అని అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని తెలిపారు. ఇవి కులతత్వాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పారు. 2024 ఎన్నికలలోపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ పార్టీల గురించి తెలియజేయాలని అన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపుపై కొందరు అనవసర రాజకీయాలు చేశారని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ అనే హిందీ చిత్రం గురించి ప్రస్తావించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి. వీటి ద్వారా వాస్తవాలు బయటపడతాయి. చాలా కాలంగా దాగి ఉన్న నిజాలను ఈ సినిమా చూపించింది' అని అన్నారు. కొందరు కావాలనే నిజాలను కాల్చివేశారని ఆరోపించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.