- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే
దిశ, బెజ్జంకి: గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగాస్వాములు కావాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న నూతన గ్రామ పంచాయతీ, మహిళా సంఘ భవనం, సీసీ రోడ్లు, మురికి కాల్వలు, బేగంపేటలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకీషన్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పల్లేల్లో సబ్బండ వర్గాల ప్రజలు జీవనం సాగిస్తుంటారని, అందరూ గ్రామాల అభివృద్ధిలో కృతజ్ఞతతో భాగాస్వాములవ్వాలని అన్నారు. మట్టి రోడ్ల కారణంగా నర్సింహుల పల్లి గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెజ్జంకి నుండి గుగ్గిల్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం, జంగాల చెరువు వద్ద మత్తడి మరమ్మతులు చేపట్టాలని పాలక వర్గం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
వెంటనే సంబంధిత అధికారులు పర్యవేక్షించి మత్తడి మరమ్మతు పనులు చేపట్టడానికి చర్యలు చేపట్టాలని, కల్వర్ట్ నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నర్సింహుల పల్లి పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తుండగా.. విద్యాధికారులు డిప్యూటేషన్ ద్వారా ఏకోపాద్యాయుడిని నియమించారని.. నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తూ ఇద్దరు విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నామని.. మరో ఉపాద్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలోనే 42 మంది విద్యార్థులకు ఏకోపాద్యాయుడేంటని ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎంఈఓతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఉపాద్యాయుడి నియామకానికి కృషి చేస్తానన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో 2 అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు.
అనంతరం లక్ష్మిపూర్, పాపన్నపల్లి, వీరాపూర్ గ్రామాల్లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.3 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. తోటపల్లిలో మంత్రి తన్నీరు హారీష్ పర్యటన దృష్ట్యా డబుల్ ఇళ్లు, గ్రామ పంచాయతీ, మహిళా సంఘం భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజయ్య, లక్ష్మారెడ్డి, సర్పంచులు కుసుంబ అంజవ్వ, సంజీవరెడ్డి, నర్సింగరావు, జెల్లా ఐలయ్య, రాగుల మొండయ్య, పెంటమీదీ శ్రీనివాస్, పెండ్యాల బాపు రెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ కనగండ్ల తిరుపతి, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ కుంట హరికృష్ణ, ఎంపీడీఓ దమ్మని రాము, టీఆర్ఎస్ నాయకులు బిగుల్ల దుర్గ సుదర్శన్, కొర్వి తిరుపతి, బిగుల్ల మోహన్, లింగాల లక్ష్మన్, ఎలా శేఖర్ బాబు, బోనగిరి శ్రీనివాస్, బండిపెల్లి సతీష్, అయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.