ఆ రాష్ట్ర ప్రజలకు షాక్.. మాస్క్ ధరించాలంటున్న సీఎం

by Javid Pasha |
ఆ రాష్ట్ర ప్రజలకు షాక్.. మాస్క్ ధరించాలంటున్న సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రజలంతా మాస్క్‌ ధరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ బాధ పోతుందా అని ఎదురుచూస్తోంది. మొదటగా మొదటి వేవ్‌ పోయింది అనుకునేసరికి కరోనా సెకండ్ వేవ్ అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కరోనా నిబంధనలను ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు మాస్క్‌లు ధరించడం కూడా తప్పనిసరికాదని అధికారులు తెలిపారు. అయితే తాజాగా రాష్ట్ర సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, తాను, డిప్యూటీ సీఎం కూడా ఇంకా మాస్క్ ధరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ ధరించడం ద్వారా కరోనాను మరింత సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదన్నా, మాస్క్ అవసరం లేదు అన్న స్థానానికి మనం ఇంకా చేరుకోవలేదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.



Advertisement

Next Story

Most Viewed