వికీమీడియా ఫౌండేషన్ స్థాపన..

by Manoj |
వికీమీడియా ఫౌండేషన్ స్థాపన..
X

దిశ, ఫీచర్స్: 'వికీమీడియా ఫౌండేషన్' 2003 జూన్ 20న ప్రారంభించబడింది. వికీపీడియా వ్యవస్థాపకుల్లో ఒకరైన 'జిమ్మీ వేల్స్' ఈ ఫాండేషన్‌ను ప్రవేశపెట్టి వికీపిడియా ఇతర అనుబంధ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషల్లో విజ్ఞాన సర్వస్వాలు, ప్రణాళికల పెంపు, అభివృద్ధి, సమాచారాన్ని ఉచితంగా పంపిణీ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అమెరికాలో స్థాపించబడిన ఈ వికీమీడియా ఎలాంటి లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా, అనుబంధ ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తూనే.. విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వివిధ దేశాల్లోని వికీపీడియా సంఘాలతో కలిసి పనిచేస్తుంది.

కొన్ని దక్షిణాది దేశాల్లో కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగుల ద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతూనే.. కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే అరకోటి ప్రజలకు సేవలందిస్తోంది. అలాగే దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజలు, సంస్థల నుంచి ధన, వనరుల సేకరణ, ప్రాజెక్టుల్లో మీడియావికీ సాఫ్ట్‌వేర్ నిర్వహణ, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల కార్యక్రమాలు చేపడుతుంది.

Advertisement

Next Story