ఈపీఎఫ్ఓలోని పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛనుకు ప్రతిపాదన!

by Harish |
ఈపీఎఫ్ఓలోని పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛనుకు ప్రతిపాదన!
X

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో కేంద్ర పెన్షన్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించి, ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓలోని పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను జమ కానుంది. దీంతో మొత్తం 73 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డిపాజిట్ కానుంది. ప్రస్తుతం దేశంలో 138 ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాలు ఉండగా, వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సమయాల్లో లబ్దిదారులకు పెన్షన్ సరఫరా చేస్తున్నారు. అయితే, కొత్తగా ప్రతిపాదించిన పెన్షన్ పంపిణీ వ్యవస్థకు ఆమోదం వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి అందరికీ పెన్షన్ అందనుంది. ఈ కొత్త విధానం వల్ల నకిలీ అకౌంట్లు, ఉపయోగంలో లేని అకౌంట్లను తొలగించడానికి అవకాశం ఉంటుందని సంబధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ నెలాఖరున జరిగే సమావేశంలో ఆరు నెలల కంటే తక్కువ సమయం పీఎఫ్ అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నవారికి కూడా పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆరు నెలల నుంచి పదేళ్లు ఉన్నవారికి మాత్రమే పీఫ్ నగదు తీసుకునే వీలుంది.

Advertisement

Next Story

Most Viewed