ఇంజనీరింగ్ అద్భుతం.. ఇండియాలో తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జి

by Manoj |
ఇంజనీరింగ్ అద్భుతం.. ఇండియాలో తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జి
X

దిశ, ఫీచర్స్ : జమ్ము, కశ్మీర్‌లో నిర్మిస్తున్న భాతరతదేశపు మొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న 'అంజి ఖాడ్' వంతెన ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తికానుంది. అంజి నదికి ఎగువన ఉన్న రియాసి జిల్లాలో గల ఈ వంతెన సంక్షిష్ట మార్గమైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్‌లో ఒక భాగం. ఇక్కడి ప్రయాణం హిమాలయాల గుండా ఎత్తయిన ప్రదేశంలో సాగుతుంది. ఈ బ్రిడ్జి రాష్ట్రంలోని కత్రా, రియాసి ప్రాంతాలను కలపనుంది.

తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఈ పోస్టుకు 'దేశంలోనే మొట్టమొదటి కేబుల్-ఆధారిత రైల్వే వంతెన, #కశ్మీర్‌ను కలుపుతున్న అంజి ఖాడ్ వంతెన సిద్ధమవుతోంది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 473.25 మీటర్ల పొడవున నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో భారీ తుఫాన్లను ఎదుర్కొనేలా రూపొందించబడిన ఈ వంతెనకు 96 కేబుల్స్ మద్దతునిస్తాయి. ఇది USBRL ప్రాజెక్ట్ రెండో దశలో చీనాబ్ వంతెనకు దక్షిణంగా 7 కి.మీ. దూరంలో నిర్మించబడుతోంది. ఈ ప్రాంతంలోని అత్యంత సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా చీనాబ్ నదికి అడ్డంగా నిర్మించిన ఆర్క్ బ్రిడ్జి మాదిరిగా ఇక్కడ నిర్మించడం అసాధ్యం. కాబట్టి అంజి ఖాడ్ వంతెన వద్ద నిలువు వాలుపై ఒక పైలాన్‌ను మాత్రమే నిర్మిస్తున్నారు.

వంతెన నిర్మాణంలో పంప్ కాంక్రీటింగ్ సిస్టమ్ అమరికతో సహా ప్రత్యేకమైన, అధునాతన సాంకేతికతలతో పాటు ఎక్విప్‌మెంట్ ఉపయోగించబడింది. కాగా ఈ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) అభివృద్ధి చేస్తోంది.

https://www.kooapp.com/koo/ashwinivaishnaw/39a8c933-c9ed-42d1-94b7-692c8adec3af

Advertisement

Next Story

Most Viewed