అమ్మాయిగా మారిపోయిన ఎలన్ మస్క్.. ట్విట్టర్‌లో చర్చ

by Harish |
అమ్మాయిగా మారిపోయిన ఎలన్ మస్క్.. ట్విట్టర్‌లో చర్చ
X

దిశ, ఫీచర్స్: యూనిక్ థాట్స్‌తో టెక్ వరల్డ్ అటెన్షన్ క్యాచ్ చేస్తుండే టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌.. ప్రస్తుతం తన వింత చేష్టలతో నెటిజన్ల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ ఖాతాలో తన పేరును 'ఎలోనా మస్క్‌'గా మార్చుకున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను వ్యతిరేకిస్తూ తనతో పోరాడమని మార్చి 14న ఎలన్ బహిరంగ సవాల్ విసరగా.. అప్పటి నుంచి పుతిన్ మద్దతుదారులకు, ఎలన్ మస్క్‌కు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఈ మేరకు ఎలన్‌ పుతిన్‌తో పోరాడేంత బలవంతుడు కాదని, అలా చేయాలంటే ముందు కండలు పెంచుకోమని చెచెన్ రిపబ్లిక్ లీడర్ రంజాన్ కదిరోవ్ ఉచిత సలహా ఇచ్చారు. ఇందుకోసం రష్యా స్పెషల్ ఫోర్సెస్ యూనివర్సిటీ వద్ద ట్రైనింగ్ తీసుకోవాలని.. అయితే అక్కడి నుంచి 'ఎలోనా(అమ్మాయి)'గానే తిరిగొస్తావంటూ ఎలన్‌కు చురకలంటించారు.

ఇక ఈ మెసేజ్‌కు రిప్లయ్ ఇచ్చిన ఎలన్.. 'ఆఫర్‌కు ధన్యవాదాలు. కానీ అలాంటి అద్భుతమైన శిక్షణ నాకు మరింత ప్రయోజనాన్నిస్తుంది. ఒకవేళ అతను ఫైట్ చేసేందుకు భయపడితే నేను నా ఎడమ చేతిని మాత్రమే ఉపయోగిస్తాను. పైగా నేను ఎడమచేతివాటం వ్యక్తిని కూడా కాదు' అని కౌంటర్‌ ఇస్తూ చివరన 'ఎలోనా' అని సంతకం చేశాడు. ఈ క్రమంలో ఎలన్ మస్క్ తన పేరును 'ఎలోనా'గా మార్చుకున్నాడంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. అంతేకాదు 'రిచెస్ట్ ఉమన్ ఇన్ ద వరల్డ్' అని గూగుల్ చేస్తే, లాంగ్ హెయిర్‌తో అమ్మాయిలా కనిపిస్తున్న ఎలన్ ఫొటో దర్శనమిస్తున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 'కంగ్రాచ్యులేషన్స్ ఎలోనా' అంటూ విషెస్ చెప్తున్నారు.

Advertisement

Next Story