- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ducati Multistrada V2: రూ. 14.65 లక్షల ధరలో కొత్త మోటార్‌సైకిల్ విడుదల చేసిన డుకాటి!
Ducati Multistrada V2
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటీ దేశీయ మార్కెట్లో తన కొత్త బైక్ 'మల్టీస్ట్రాడ వీ2' మోడల్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వెర్షన్ రూ. 14.65 లక్షలు ఉండగా, టాప్ ఎండ్ 'ఎస్ ' వేరియంట్ రూ. 16.65 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో కంపెనీ నుంచి వచ్చిన మల్టీస్ట్రాడ 950 మోడల్ స్థానంలో ఈ కొత్త బైకును విక్రయించనున్నట్టు డుకాటీ పేర్కొంది. ఈ కొత్త బైక్ మల్టీస్ట్రాడ 950 ఎస్ కంటే రూ. 1.60 లక్షలు ఖరీదైనదని, దీంతో ప్రీమియం విభాగంలో అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌గా ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ట్రయంఫ్ టైగర్ 900 జీటీ, బీఎండబ్ల్యూ ఎఫ్900 ఎక్స్ఆర్ బైకులకు గట్టీ పోటీనివ్వనుంది.
అంతేకాకుండా ఈ సరికొత్త బైకులో అనేక రకాలైన కొత్త అప్‌డేట్‌లతో పాటు సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. మల్టీస్ట్రాడ తరహాలోనే డిజైన్, బాడీవర్క్‌తో ఈ బైక్ లభిస్తుంది. అయితే, అదనంగా 937సీసీ ఇంజిన్‌తో వస్తున్న బైకులో కొత్త ఇంజిన్ కవర్ డిజైన్, సీటింగ్ సౌకర్యాల్లో మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే, 5-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మార్పులు చేసిన గేర్‌బాక్స్‌ను కంపెనీ అందిస్తోంది. అదే విధంగా మెరుగైన ఏబీఎస్, సెమీ యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్, కార్నరింగ్ లైట్స్ సహా అనేక కొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం అప్‌గ్రేడ్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది.
- Tags
- Ducati