- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన 'డుకాటి'!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ బుధవారం భారత మార్కెట్లోకి తన సరికొత్త పినగేల్ వీ2 మోడల్ సూపర్‌బైక్‌ను విడుదల చేసింది. ప్రత్యేక ఎడిషన్‌లో తెచ్చిన ఈ బైక్ ధరను రూ. 21.30 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. డుకాటీ 996 ఆర్ ప్రేరణతో పినగేల్ వీ2 బేలిస్‌గా పిలవబడే బైక్ 2001లో మొదటి వరల్డ్ సూపర్‌బైక్ టైటిల్‌ను గెలిచి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వివరించింది. ప్రత్యేకంగా విడుదల చేసిన పినగేల్ వీ2 వేరియంట్ 995 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో మూడు రంగుల్లో అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. రేసింగ్ విభాగానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్‌గా కొత్త ఫీచర్లను వినియోగదారులకు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. భారత మార్కెట్లో ప్రత్యేక మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర అన్నారు.