ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం..

by Mahesh |
ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఢిల్లీకి చెందిన శుభమ్ మల్హోత్రా అనే మోడల్, అతని స్నేహితుడు కృతి వద్ద రూ. 1 కోటి విలువైన ప్రీమియం నాణ్యమైన 'చరస్' (గంజాయి) సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరిద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి 'చరస్‌'ను సేకరించి తమ కారులో దిండు లో దాచి ఢిల్లీకి తరలిస్తున్నారన్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గత కొద్దికాలంగా శుభమ్ మల్హోత్రా అనే మోడల్ తనకున్న నెటవర్క్ తో DU క్యాంపస్ లో విద్యార్థులకు, యువకులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను చెడగొడుతున్నాడు. పెద్ద నెట్ వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story