అదుపుతప్పిన ట్రాక్టర్.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి

by Javid Pasha |   ( Updated:2022-04-04 06:16:07.0  )
అదుపుతప్పిన ట్రాక్టర్.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి
X

దిశ, ముధోల్: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన తానూర్ మండలంలోని దౌలతాబాద్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, అక్కడి ప్రజలు ఈ ప్రమాదం గురించి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మునీర్ గ్రామ శివారులో పని నిమిత్తం ట్రాక్టర్ నడుపుతూ వెళ్లాడు. అయితే అక్కడి ప్రాంతంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మునీర్ మృతి చెందాడు. ఇదే ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న కూలీ ఖాజా తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వైద్య సేవల నిమిత్తం భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తానూర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




Advertisement

Next Story