- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. NBK 109 నుంచి టైటిల్, టీజర్ డేట్ ఖరారు..!!
దిశ, వెబ్‌డెస్క్: బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) NBK109 చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్(Srikara Studios), ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్(Fortune Four Cinemas Banners)పై బాలయ్య(Balayya) మూవీ తెరకెక్కుతోంది. భారీ పీరియాడిక్ యాక్షన్‌గా వస్తోన్నఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మేకర్స్ NBK109 చిత్రం నుంచి టైటిల్ అప్డేట్ ఇచ్చారు. నవంబరు 15 వ తేదీన మార్నింగ్ 10 గంటల 24 నిమిషాలకు విడుదల చేయనున్నామని వెల్లడించి.. పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా చిత్ర యూనిట్ మరో భారీ గుడ్‌న్యూస్ ప్రకటించారు. టైటిల్‌తో పాటు టీజర్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. దీంతో బాలకృష్ణ అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు. నెక్ట్స్ రాబోయే టీజర్, టైటిల్ పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు.
ఇక ఈ వయసులో కూడా బాలయ్య కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అఖండ(Akhaṇḍa), వీర సింహా రెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి(Veera Simha Reddy) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో ఓ ముద్ర వేసుకున్నాడు బాలయ్య. అప్పటికీ ఇప్పటికీ నందమూరి హీరో నటన, డాన్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా.. అద్భుతంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు సినిమాల్లో రాణిస్తూనే ఇటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ టాక్ షో(Unstoppable Talk Show)కు బాలయ్య హోస్ట్ గా చేస్తూ జనాల్ని అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షో సక్సెస్ ఫుల్‌గా మూడ్ సీజన్లు కంప్లీట్ చేసుకుంది.