- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పగడపు దీవులను రక్షిస్తున్న డాల్ఫిన్ మలం..
దిశ, ఫీచర్స్ : పగడపు దిబ్బలు మహాసముద్రాల్లో జీవ వైవిధ్యానికి మద్దతిస్తున్నాయి. మిలియన్ల మంది ప్రజలకు జీవనోపాధిగా మారుతున్నాయి. తుఫాన్లు, కోత నుంచి తీరప్రాంతాన్ని రక్షిస్తూనే.. వెకేషన్ స్పాట్స్‌గా కూడా పనికొస్తుంటాయి. అయితే మారుతున్న పర్యావరణ పరిస్థితులు దిబ్బలపై ఒత్తిడి కలిగించి.. కోరల్ బ్లీచింగ్‌కు దారి తీస్తున్నాయి. ఉష్ణోగ్రత, కాంతి, పోషకాల్లో మార్పుల ద్వారా అంతరించిపోయే దుస్థితికి చేరుకుంటున్నాయి. అయితే ఈ పరిస్థితుల నుంచి వీటిని కాపాడేందుకు డాల్ఫిన్ పూ(మలం) ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో పగడపు దిబ్బలను రక్షించే పోషకాలున్నాయని జూలాజికల్ సొసైటీ లండన్ (ZSL) నివేదించింది. స్పిన్నర్ డాల్ఫిన్స్ తమ రోజువారీ ప్రయాణంలో గ్రహించిన నైట్రోజన్ మొత్తం.. పగడపు దిబ్బల ఉత్పాదకత, స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుందని అధ్యయనం పేర్కొంది.
స్పిన్నర్ డాల్ఫిన్స్ ఎక్కడ నివసిస్తాయి?
దాదాపు 6.5 అడుగుల(సుమారు 2 మీటర్లు) పొడవుంటే స్పిన్నర్ డాల్ఫిన్స్‌కు సన్నని ముక్కు ఉంటుంది. తెలుపు రంగు పొట్ట, ముదురు బూడిద వెన్నుముకను కలిగి ఉండే ఈ డాల్ఫిన్స్.. థాయ్‌లాండ్ సమీపంలో మధ్య అమెరికా పసిఫిక్ తీరం వెంబడి, హవాయి దీవుల చుట్టూ ఉన్న వెచ్చని సముద్ర జలాల్లో నివసిస్తున్నాయి. అయితే మాల్దీవుల్లో వీటిపై ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రాంతంలో దాదాపు 105 స్పిన్నర్ డాల్ఫిన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఉదయాన్నే అటోల్ మడుగులలోకి(రింగ్-ఆకారపు పగడపు దిబ్బలు) ప్రవేశిస్తాయని, అక్కడ హాఫ్ డే విశ్రాంతి తీసుకున్న తర్వాత.. మధ్యాహ్నం వేటాడేందుకు బయలుదేరుతాయని, రాత్రిపూట లోతైన నీటిలో మేత కోసం వెతుకుతాయని తెలిపారు. అయితే మొదటి హాఫ్ డేలో ఒక డాల్ఫిన్ దాదాపు 288 కిలోల బరువుండే పూప్ లేదా 3-4 మనుషుల బరువుతో సమానమైన నత్రజనిని ఈ మడుగులలోకి విసర్జిస్తున్నాయని అంచనా వేశారు. తద్వారా పగడాలకు కీలకమైన పోషక సరఫరాలను అందిస్తూ.. దిబ్బలను రక్షిస్తున్నాయని స్పష్టం చేశారు.
అయితే ఈ జాతులు IUCN రెడ్ లిస్ట్‌లో అంతరించిపోతున్నట్లు వర్గీకరించబడకపోయినా.. వేట, ఇతర సముద్ర శిథిలాలతో సంభావ్య చిక్కులు, ఓడలతో ఢీకొనడం, శబ్ద భంగం, నివాస క్షీణతతో పాటు మానవ కార్యకలాపాల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి.