రోజుకి 5 నిమిషాలు ఇలా చేయండి.. ఈ సమస్యలన్నీ పరార్ అవ్వాల్సిందే?

by Anjali |
రోజుకి 5 నిమిషాలు ఇలా చేయండి.. ఈ సమస్యలన్నీ పరార్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘ధ్యానం(meditation) చేయడం వల్ల మానసిక, శారీరక ఉపయోగాలున్నాయి. అహంకారం, కోపం, ఈర్ష్య, ఒత్తిడి లాంటి చెడు గుణాలు తగ్గుతాయి. అలాగే శారీరక ఆరోగ్యానికి సంబంధించి గుండె(Heart), ఊపిరితిత్తుల(lungs)కు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా గడపొచ్చు’’. మెడిటేషన్ అనేది ఆరోగ్యానికి బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో యాంగ్జైజీ, స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ దరిచేరుతున్నాయి. కాగా ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే.. ఈ రోగాలను దరిచేరనివ్వకుండా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం యోగా చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఐదు నిమిషాలు యోగా చేస్తే శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని అంటున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతి రోజూ యోగా చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలు(Negative thoughts) దూరమవుతాయి. మెడిటేషన్ స్ట్రెస్ లెవల్స్ ను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. యోగా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. సెల్ఫ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. మెడిటేషన్ దంపతుల్లో ఫెర్టిలిటీ సమస్యను దూరం చేయడంలో మేలు చేస్తుంది. దగ్గు(Cough), జలుబు(Cough) సమస్యలతో బాధపడేవారికి ఇమ్యూనిటి పవర్ ను పెంచడంలో తోడ్పడుతుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గి తొందరగా నిద్రపోతారు. కాగా ఎప్పుడైనా, ఎక్కడున్నా 5 నిమిషాలు యోగా చేస్తే సమస్యలన్నీ దూరమై సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed