భార్యతో విడాకులు.. లవ్ సింబల్‌తో గర్ల్ ఫ్రెండ్‌కి విషెష్ చెప్పిన స్టార్ హీరో.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
భార్యతో విడాకులు.. లవ్ సింబల్‌తో గర్ల్ ఫ్రెండ్‌కి విషెష్ చెప్పిన స్టార్ హీరో.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హృతిక్.. ‘వార్ 2’(War 2) అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తుండగా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వార్ 2 ముంబై(Mumbai) నగరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రముఖ నటి సబా ఆజాద్‌(Saba Azad)కి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే సభా అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఇందులో లవ్ సింబల్ ఎమోజీని కూడా షేర్ చేశాడు. దీంతో ఈ విషయం బాలీవుడ్‌(Bollywood)లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే సబా ఆజాద్ ప్లే బ్యాక్ సింగర్‌(Play Back Singer)గా పని చేసేది. అలాగే పలువురు స్టార్ హీరోయిన్‌లకి వాయిస్ డబ్బింగ్(Dubbing Artist) కూడా చెప్పేది.

ఈ క్రమంలో గతంలో హృతిక్ హీరోగా నటించిన సినిమాలకి సబా ఆజాద్ పని చేసింది. దీంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే సబాతో ప్రేమ కారణంగానే హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్‌(Susenna Khna)కి విడాకులు ఇచ్చాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఈమధ్య హృతిక్ రోషన్ సబా ఆజాద్‌తో కలసి చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story