- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాజ్యాంగ పరిరక్షణకు సకల జనులు ఏకమవ్వాలి: ప్రొఫెసర్ కోదండరాం
దిశ, మెదక్: మెదక్ జిల్లాలోని టీఎన్జీవో భవన్‌లో బుధవారం జరిగిన రాజ్యాంగ పరిరక్షణ జిల్లా స్థాయి సదస్సులో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం, ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద్భంగా ప్రొఫెసర్ కోదండరాం, మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ లు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకమని రాచరిక పాలన కోసమే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అడుగడుగునా అంబేద్కర్ వ్యతిరేక భావజాలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుణికి పుచ్చుకొన్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని తెలంగాణ భవన్‌లో ఎదురుగా ఉంచి, ఇప్పుడు తెలంగాణ భవన్‌లో లేకుండా చేశారని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అగ్రవర్ణాల పేదల హక్కులకోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 9న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి భారీ ర్యాలీ నిర్వహించి సదస్సు నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యవాదులు, అన్ని పార్టీల నాయకులు, మేధావులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రభుత్వంపై యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు. రాజ్యాంగ సూత్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రాజ్యాంగాన్ని రాసేందుకు ఆలోచిస్తున్నారని ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాస్వామ్య దాడులపై ఉందని అన్నారు. ప్రజలను, మేధావులను, ప్రజా సంఘాలను, చైతన్యపరిచి అన్ని జిల్లాలను కలియ తిరిగి ఏప్రిల్ 9న హైదరాబాద్ లో భారీ సభ ద్వారా ముఖ్యమంత్రి కుట్రలను బహిర్గతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ప్రజా సంఘాల నేతలు తదితరులు భారీ సంఖ్యలో ఈ సదస్సుకు హాజరయ్యారు.