Rajinikanth: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ‘వెట్టయన్’ ప్రీక్వెల్‌‌కు సిద్ధం

by sudharani |
Rajinikanth: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ‘వెట్టయన్’ ప్రీక్వెల్‌‌కు సిద్ధం
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ (Vettaiyan the Hunter). దసరా సందర్భంగా రిలీజైనా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అందుకున్న విషయం తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ (TJ Gnanavel) దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా ముఖ్య ప్రాతల్లో నటించి మెప్పించారు. అయితే.. ‘వెట్టయన్ ది హంటర్’ (Vettaiyan the Hunter) కు భారీగా ప్రేక్షకాధరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (TJ Gnanavel) మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘వెట్టయన్’ (Vettaiyan) ప్రీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘రజినీకాంత్ (Rajinikanth) అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. ఆయన అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ (Rajini) స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్. రజినీకాంత్ (Rajinikanth)ను ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ (excite) అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

‘వెట్టయన్: ది హంటర్’ (Vettaiyan the Hunter)కు సీక్వెల్ ప్లాన్ ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఈ సినిమా ప్రీక్వెల్‌ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. 'వెట్టయన్: ది హంటర్' (Vettaiyan the Hunter) అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను’ అని తెలుపుతూ ‘నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్' (Vettaiyan)పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. చివరగా 'వెట్టయన్' (Vettaiyan)కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed