- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధరణి ఎఫెక్ట్.. అసైన్డ్ భూమి పట్టా భూమి గా మారే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రికార్డుల పునర్వ్యవస్థీకరణ తర్వాత వచ్చిన ధరణిలో జరిగిన తప్పిదాలు కొందరి భూ యజమానులకు తిప్పలు తెస్తే.. మరి కొందరికి మాత్రం అప్పనంగా లాభాలు తెచ్చి పెడుతుంది. ఇప్పటివరకు జరిగిన తప్పిదాలతో చాలా మంది రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. న్యాయం జరగడం లేదు. లిటిగేషన్ మొదలుకొని ఏవోసీ ల కోసం చెప్పులు, కాళ్లరిగేలా తిరుగుతున్న వారి కష్టాలు తీరడం లేదు.
కానీ కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు, కొందరు ఉద్యోగ సంఘాల నేతలు భూముల పై ఉన్న పట్టుతో సర్కారు, అసైండ్ భూముల పక్కన ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసి వాటి పక్కన ఉన్న సర్కారు భూములకు ఎసరు పెట్టారు. అధికారంతో పాటు అధికార యంత్రాంగం చెప్పు చేతుల్లో ఉండడంతో సర్కారు అసైండ్ భూములు కాస్త.. పట్టా భూములుగా అమ్మకానికి పెట్టి బేరసారాలు జోరుగా సాగుతున్నాయి.
నిజామాబాద్ - ఆర్మూర్ రహదారిపై మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి లోని అటవీ ప్రాంతంలో అసైండ్ భూముల వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రధాన రహదారిపై నుంచి ఒక మైలు దూరంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల అసైండ్ భూములు ఉన్నాయి. వాటిని కొందరు దళితులకు కేటాయించింది.. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పట్టాలు వారి పేర్ల మీదే ఉన్నాయి. అక్కడ ఒక ప్రజా ప్రతినిధి కబ్జాలో 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని తర్వాత ఉన్న భూమిపై కొందరి కన్ను పడింది. అందుకు కారణం అక్కడ ఉన్న అసైండ్ భూమి లో 12 ఎకరాలు పట్టా భూమి గా నమోదు కావడమే.
దానిని సాకుగా చేసుకుని చౌక ధరకు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత దాని పక్కన ఉన్న 18 ఎకరాల అసైండ్ భూములను దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ భూములు అమ్మకానికి యత్నాలు మొదలుపెట్టారు. ఒక ప్రజా ప్రతినిధి బంధువు, ఒక ఉద్యోగ సంఘం నేతల అండదండలు ఉండడంతో అసైండ్ భూమి కాస్త పట్టా భూమి గా మారి అమ్మకాలకు బేరసారాలు జరుగుతున్నాయి. ఇటివలే ఒక పార్టీ తో అమ్మకానికి ఎకరాకు రూ.20 లక్షలతో బేరం కుదుర్చుకున్న చర్చలు కొలిక్కి వచ్చే దశలో ధరణి ద్వారా జరిగే అసైండ్ టూ పట్టా భూమి వ్యవహారం బయటకు వచ్చింది.
అడవి మామిడిపల్లి లో అసైండ్ భూమి అమ్మకం విషయం బహిర్గతం కావడంతో అధికార పార్టీ నేత బంధువు రంగంలోకి అసైండ్ భూమి కాదు.. పట్టా భూమి అని నమ్మించే ప్రయత్నాలు మొదలు పెట్టడం విశేషం. ఏకంగా రెవెన్యూ అధికారులకు అడవి మామిడి పల్లి లో ఉన్నది అసైండ్ భూమి కాదని, పట్టా భూమి అని చెప్పాలని ఒత్తిడి తేవడం గమనార్హం. అడవి మామిడి పల్లి లో అటవీశాఖ అనుమతి లేకుండా అడవిని నరికి రోడ్డు నిర్మించిన విధానం పై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు కొంత అటవీ భూమిని నరికి సాగు చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు మీనా వేషాలు లెక్కించడం వెనుక మతలబు ఉందనే వాదనలు ఉన్నాయి. రోడ్డు వేసేటప్పుడు అటవీ అధికారులు ట్రాక్టర్ లను సీజ్ చేసి అధికార పార్టీ నేత ఒత్తిడా లేక ఉద్యోగ సంఘం నేత మంత్రాంగమా అని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ పార్క్ దగ్గరలో కోట్ల విలువ చేసే అసైండ్ భూమిని కొందరు రియల్ వ్యాపారుల మాదిరిగా అమ్మకాలకు పెట్టిన.. జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. పేద దళితులకు పంపిణీ చేసేందుకు భూములు లేవని లెక్కలు చెప్పే అధికారులు మామిడి పల్లి అసైండ్ భూముల వ్యవహరంపై నోరు మెదపకపోవడం విశేషం. అధికార పార్టీ నేత బంధువు, ఉద్యోగ సంఘం నేత ముందుండి ఈ తతంగం నడపడంతో పై అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.