- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nithya Menon: ‘ఇడ్లీ కొట్టు’ నడపబోతున్న ధనుష్- నిత్యామీనన్.. ‘కొత్త జర్నీ స్టార్ట్’ అంటూ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. ఇలా ప్రతిఒక్కరి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటివరకు అంతగా గ్లామర్ షో చేయలేదు. ‘వెల్లతూవల్, కేరళ కేఫ్ , ఏంజెల్ జాన్, అపూర్వరాగం, అన్వర్, అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, వెప్పం, ఐదోండ్ల అయిదు, మకరమంజు, ఇష్క్, తలసమయం ఓరు పెంకుట్టి, బ్యాచిలర్ పార్టీ, జబర్దస్త్ , గుండెజారి గల్లంతయ్యిందే, బెంగళూరు డేస్, రుద్రమదేవి, కాంచన 2, S/O సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, ఒక్క అమ్మాయి తప్ప,గీత గోవిందం, భీమ్లా నాయక్’ వంటి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇకపోతే నిత్యామీనన్ మరోసారి హీరో ధనుష్‌తో జతకట్టబోతుంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి నటించిన తిరు సినిమాకు ఏకంగా ఈ భామకు బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిత్యా సోషల్ మీడియాలో ఓ పిక్ పంచుకుంది. నిత్యా అండ్ ధనుష్ టీ గ్లాసులను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్ సోషల్ మీడియాలో పంచుకుని.. ‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ కడై’ అని క్యాప్షన్ జతచేసింది. కాగా ధనుష్, నిత్యా మీనన్ నటించబోయే చిత్రం పేరు ఇడ్లీ కొట్టు అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఎంటంటే? విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ మూవీకి ధనుషే దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం నిత్యామీనన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ ఇడ్లీ కొట్టు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.