- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు థాంక్స్ చెప్పిన డీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 4.5 శాతం కేటాయించడం సంతోషంగా ఉన్నదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీని వలన పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన సీఎం కేసీఆర్ ,ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ డెవలప్‌మెంట్, మెడిసిన్, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, డయాగ్నస్టిక్ రీఏజెంట్స్ కోసం సుమారు రూ. 14 వందల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీని వలన ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మారుమూల ప్రజలకు కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల అప్‌గ్రేడేషన్, ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ తదితరాల కోసం రూ.250 కోట్ల వరకూ కేటాయించారన్నారు. జిల్లాల్లోని అర్బన్ ఏరియాల్లోనూ బస్తీ దవాఖాన్లు తీసుకురావడం వలన ప్రైమరీ హెల్త్ సిస్టమ్ బలోపేతం అవుతుందన్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించి ట్రీట్‌మెంట్ అందించడానికి వీలవుతుందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ఆరోగ్య రంగా ముఖ చిత్రాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదన్నారు.