- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గృహ నివాసాలపైనే మృత్యువు.. పట్టించుకొని అధికారులు..
దిశ, హాలియా: హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కె.వి కాలనీలో సుమారు 250 కుటుంబాలు నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ కాలనీ పేరుతో అనుముల గ్రామంలో సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమిని అప్పటి రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అనుముల గ్రామంలో కాలనీ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు వ్యవసాయ భూమిగా ఉండడంతో ఆ భూమి మీదుగా గతంలో 11 కేవీ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2006 నుండి 2008 సంవత్సరం మధ్యలో ఈ వ్యవసాయ భూమిలో ప్రభుత్వం పేదలకు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. ఆనాటి నుండి నేటికీ ఈ కాలనీలో ఎన్నో వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాని నేటికి గృవా నివాసాలపై వెల్తున్నా 11 కె వి విద్యుత్ వైర్లను మాత్రం మార్చడం లేదంటు కాలనీ వాసులు వాపోతున్నారు.
రావులపాటి కొండలు (కె వి కాలనీ)
2007 వ సంవత్సరంలో కె వి కాలనీ ఏర్పాటు చేశారు. గతంలో ఇది గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు అనుముల, హాలియను కలుపుకొని మున్సిపాలిటీ గా మార్చారు. వైర్లు మార్చమంటే కరెంటొళ్లు మాకు పర్మిషన్ కావాలి, సొంతంగా మార్చడానికి వీలు లేదంటున్నారు. ఇండ్లపై ఉన్న వైర్లు తీయడం లేదు కాని పంట పొలాల్లో ఉన్న వైర్లు మాత్రం వెంటనే మారుస్తున్నారు. వైర్ల క్రింద ఉన్న కుటుంబాలు ఎప్పుడు ఎం జరుగుతుందొ తెలియక భయంతో బ్రథుకున్నమని, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వైర్లను మార్చాలంటూ కాలని వాసులు కోరుకుంటున్నారు.