- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్ట్రేలియా స్పిన్ సలహాదారుగా డేనియల్ వెట్టోరి
కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ బౌలింగ్ సలహాదారునిగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ అనంతరం లాహోర్‌లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్ కోసం కంగారు జట్టు ప్లేయర్లకు స్పిన్ సలహాదారుగా వెట్టోరి వ్యవహరించనున్నాడు.
గతంలో వెట్టోరి 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. వెట్టోరి తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 705 వికెట్లు సాధించగా.. అందులో 365 టెస్ట్, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇకపోతే మార్చి 29న పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే లాహోర్ వేదికగా జరగనుంది.