రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? సైబరాబాద్ పోలీసులు ఏమన్నారంటే

by Anukaran |
రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? సైబరాబాద్ పోలీసులు ఏమన్నారంటే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఏదో ఒక చోట భారీ ప్రమాదం జరగడం.. మృతి చెందారన్న వార్తలు నిత్యకృత్యమయ్యాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే అని నివేదికల్లో తేలింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కారు నడిపే వారు సీటుబెల్ట్ పెట్టుకోకపోవడం, వాహన పొడవును అంచనా వేయకుండా ఓవర్ టేక్ చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు చేశారు. ఇందులో '' రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్ల ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతాయని, మీతో పాటు ఇతరుల ప్రాణాలఖు ప్రమాదమంటూ'' అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా, రోడ్డుపై వాహనం నడిపే సమయంలో ఒక్కసారిగా టైర్ పేలడం కానీ, పంక్చర్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు.

Advertisement

Next Story