రోజురోజుకు పెరుగుతున్న పత్తి ధరలు.. బాధ పడుతున్న రైతులు

by Javid Pasha |
రోజురోజుకు పెరుగుతున్న పత్తి ధరలు.. బాధ పడుతున్న రైతులు
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.10,700 పలికింది. రోజు రోజుకు పత్తి ధరలు పైపైకి ఎగబాకడంతో ఇప్పటివరకు ఈ సంవత్సరంలోనే అత్యధిక రేటు గురువారం నమోదు కావడం విశేషం. పత్తిని పండించిన రైతులు పత్తిని అమ్మే క్రమంలో నవంబర్, డిసెంబర్ ప్రథమార్థంలోనె రూ.8000 పై బడి రేటుతో చాలా మంది రైతులు అమ్మేయ్యగా, రోజురోజుకు పెరుగుతున్న పత్తి రేట్లను చూసి ముందు పత్తి అమ్మిన రైతులు బాధ పడుతున్నారు.

ఇవే రేట్లు అప్పుడు నమోదు అయితే బాగుండు అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం అకాల వర్షం పలు కారణాలతో పంటల దిగుబడి అధికంగా రాకుండా పోయిందని, దానికి తోడు సరైన సమయంలో పత్తి పంటకు రేటు కుడా లేదని చింతిస్తున్నారు. ఇప్పుడు రేటు ఇచ్చిన మా వద్ద పత్తి లేదంటూ, ఈ పెరుగుతున్న రేట్లకు ముందు కొన్న పత్తి వ్యాపారులకే లాభం అని రైతులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed