- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12-14 ఏళ్ల వారికి 'కార్బెవ్యాక్స్'.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 12-14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన వారికి కార్బెవ్యాక్స్ టీకానే ఇవ్వాలని పేర్కొంది. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అయితే టీకా తీసుకోవడానికి 2010 లేదా అంతకు ముందు జన్మించి ఉండాలని పేర్కొంది. ఇప్పటికే కేంద్రం 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలు కొవిన్ పోర్టల్‌లో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొంతంగా లేదా తల్లిదండ్రుల ఖాతా ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు టీకా కేంద్రాల వద్ద కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంది. అంతేకాకుండా వీరికి టీకాలు సెషన్ల వారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, పౌరుల ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత టీకాను ప్రభుత్వ కొవిడ్ సెంటర్లలో ఇవ్వనున్నారు.