- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News: షర్మిలక్క ఏంది ఇది.. పాదయాత్రలో పైసల్ లొల్లి
దిశ,తిరుమలాయపాలెం: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. ప్రజలకు భరోసా కల్పించేందుకు తెలంగాణ వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించింది. చేవెళ్లలో అక్టోబర్ 20న గతేడాది ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించిన వైతెపా అధినేత్రి షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4వేల కిలోమీటర్లు,16 సెగ్మెట్లను కాలిబాటన నడిచి, తిరిగి యాత్ర ప్రారంభమైన చేవెళ్ల ల్లో ముగింపు పలకనున్నారు.
అందులో భాగంగానే గత సోమవారం ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలంలోకి వైఎస్ షర్మిల యాత్ర చేరింది. షెడ్యూల్ ప్రకారం మూడు రోజులపాటు మండలంలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగగా, గురువారంనాడు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వైయస్సార్ టీపీ సత్తా చాటి..ఉనికి నిలబెట్టుకోవాలంటే పాదయాత్రలో షర్మిల వెంబడి భారీగా జనాలు పాల్గొనాలి, అందుకు వైఎస్ఆర్ టీపీ బృందం ముందుగానే వ్యూహం చేసుకున్నాకే షర్మిల పాదయాత్ర కొనసాగింది అంటున్నారు కొందరు.
అందులో భాగంగానే యాత్ర మొదటి రోజు నుంచే ప్లాన్ ప్రకారం జన సమీకరణలు జరిగాయని తెలుస్తోంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొనే ఒక్కొక్క పర్సన్ కు రూ. 200-300 ఇస్తున్నారని, వారిని తీసుకొచ్చి తీసుకువెళ్లేందుకు ఆటో కిరాయి రూ. 500-600, పాదయాత్రలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే గురువారం నాడు మండలంలో వివిధ గ్రామాలలో జరిగిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు మండలంలోని తెట్టేలపాడు, పిండిప్రోలు,కొక్కిరేణి,తిరుమలాయపాలెం గ్రామాలతో పాటు దూరప్రాంతాలు,వేరే నియోజకవర్గలైన నుంచి జన సమీకరణలు జరిగినట్లు సమాచారం.
కాగా, వేరే నియోజకవర్గాల నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఒక్కొక్కరికి రూ250,ఆటో కిరాయి రూ600 ముందే ఒప్పందం కుదుర్చుకునట్లు తెలుస్తోంది. సాయంత్రం పాదయాత్ర ముగిసే సరికి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనాలకు సగం మందికి పైగానే ముందు చేసుకున్న ఒప్పదం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా.. వారిని పొద్దస్తమానం ఎండలో నడిపించిన జన పర్యవేక్షకులు,ఉత్త చేతులతోనే ఇంటికి పంపించినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళల విషయంలో కూడా ఆలాగే చేశారని అంటున్నారు. అంతేకాదు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వారి భుజాలను జనపర్యవేక్షకుల చెయ్యి తాకితేనే వారు కౌంట్లో ఉన్నట్టు,లేకుంటే నాట్ కౌంట్ అన్నట్లే. అందుకు వారు ముందే చేసుకున్న ప్రణాళికతో,ఏజెంట్ల ద్వారా పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన జనాలని వరుసలో నిల్చోబెట్టి "శాంతి"గా లెక్కలు వేసుకుంటున్న విజువల్స్,చిత్రాలు దిశకి అందాయి.ఈ నేపథ్యంలోనే యాత్రలో పాల్గొన్న జనాలకి, జన పర్యవేక్షకుల మధ్య కొంత గందరగోళం జరిగి చాలామందికి డబ్బులు ఇవ్వకుండానే ఉత్త చేతులతో పంపించిన ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు గ్రామాల నుంచి జనాలను తీసుకొచ్చిన ఏజెంట్లు సైతం, జన పర్యవేక్షకుల లెక్కల్లో చిక్కుకొని, వారు తీసుకొచ్చిన జనాల ముందే ఏజెంట్లు చిన్న పోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీ ఆదనేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర వారు అనుకున్న విధంనగానే సాగుతుందని ఇతర రాజకీయ పార్టీ నాయకులతో పాటు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.