ఉద్యోగ నోటిఫికేషన్ బూట‌క‌పు ప్రక‌ట‌న కావద్దు : చెరుకు సుధాకర్

by Nagaya |
ఉద్యోగ నోటిఫికేషన్ బూట‌క‌పు ప్రక‌ట‌న కావద్దు : చెరుకు సుధాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టులో కేసులు స్థానిక‌త, రిజ‌ర్వేష‌న్లు, ఇత‌ర ఆంశాల‌పై వివాదాలు ఎప్పుడు ఉంటాయని, వాటిని అధిగ‌మించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మ‌ళ్లీ వాయిదాలు వేసి అప‌ఖ్యాతి మూట క‌ట్టుకోవ‌ద్దని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో సీఎంను కోరారు. 91 వేల ఉద్యోగ నియామ‌కాలు ప్రక‌టించ‌డాన్ని, కాంట్రాక్టు ఉద్యోగాల రెగ్యల‌రైజేష‌న్ ప్రక‌ట‌న‌ను తెలంగాణ ఇంటి పార్టీ ఆహ్వానిస్తోందన్నారు. రాష్ట్రం వ‌చ్చిన తొలి రోజుల్లోనే ల‌క్ష ఉద్యోగాల నియామ‌కం జ‌రగాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశ‌గా చ‌ర్యలు చేప‌ట్టలేదన్నారు. కోర్టుల్లో కేసులు ప్రభుత్వం క‌నుస‌న్నల్లో జ‌రిగిన‌ట్లుగా ప్రచారం జ‌రిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ క‌విత నిరుద్యోగుల మ‌ద్దతుదారుల‌ను నిందించ‌డం అన్యాయమన్నారు.

అనేక మంది ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఆత్మహ‌త్యలు చేసుకున్నా ప్రభుత్వం బాధ్యతగా ఒక్క ప్రక‌ట‌న చేయలేదన్నారు. ఈ ఉద్యోగాల ప్రక‌టన‌ను తెలంగాణ స‌మాజం విశ్వసించ‌డం లేదని, కేసీఆర్ ఆత్మవిమ‌ర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నిజం చేయ‌డానికి, నీళ్ళు-నిధులు-నియామకాల ల‌క్ష్యం వేగ‌వంతం చేయడానికి ప్రతిప‌క్షాల‌ను ప్రభుత్వం ఒక్కసారి కూడా పిలువలేదన్నారు. పాలాభిషేకాల‌తో, ప్రచార ఆర్భాటాల‌తో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల క‌ల‌లు నెర‌వేర‌వని, విద్యాల‌యాలు, విశ్వ విద్యాల‌యాల‌కు అధిక నిధులు కేటాయించాలని, నోటిఫికేష‌న్లు మ‌రోసారి బూట‌క‌పు ప్రక‌ట‌న కాకుండా చూడాలని సీఎంని కోరారు.

Advertisement

Next Story

Most Viewed