- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శంకుస్థాపనలకు తమ్ముడు.. చెక్కుల పంపిణీకి అన్న ఎమ్మెల్యేలు ఇద్దరా..?
దిశ, పరిగి: శంకుస్థాపనలకు తమ్ముడు, చెక్కుల పంపిణీకి అన్న ఒకే పార్టీ.. ఒకే ఇంటి నుంచి పరిగి నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యే అయ్యారా అంటూ డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డిలు, కుల్కచర్ల మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు బిఎస్ఆంజనేయులు తప్పుపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి ఎమ్మెల్యే ఎవరని.. మహేశ్ రెడ్డి నా.. అనిల్ రెడ్డి నా.. లేక ఇద్దరు కొప్పుల బ్రదర్స్ ఎమ్మెల్యేలేనా.. అంటూ ప్రశ్నించారు. శంకుస్థాపనలు చేసేందుకు కొప్పుల అనిల్‌రెడ్డి, ఇన్సూరెన్స్ డబ్బులు ప్రొసిడింగ్స్ఇచ్చేందుకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇలా ఇద్దరు అన్నదమ్ములు మండలంలో పర్యటించేడం ఏంటంటూ ప్రశ్నించారు.
ఎన్నికల సమీపిస్తుండటంతో మళ్ళీ గ్రామాల్లో ప్రజలను మోసం చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు బయలుదేరుతున్నారు అంటూ విమర్శించారు. 2018 నవంబర్ లో ఎన్నికల ముందు సీఎం కేసీఆర్పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్‌రెడ్డి గెలిపించేందుకు ఇచ్చిన హామీలు ఏమయ్యయంటూ ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ పోయిందని, నిరుద్యోగ భృతి 3 వేలు ఎక్కడ పోయింది, లక్ష రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయిందని వీటన్నింటిని అమలు చేయడంలో సీఎం కేసీఆర్, అమలు చేయించడం లో ఎమ్మెల్యే గా మహేశ్‌రెడ్డి, విఫలమయ్యారంటూ తప్పుపట్టారు.
కేవలం ఎన్నికల కోసమే ఉచిత హామీలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు దళిత బంధు అని మరో కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. కుల్కచర్ల మండలం లో ఎంత మంది పేద దళితులకు రైతు బంధు ఇచ్చారో లిస్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే హామీ ఇచ్చారని మండిపడుతున్నారు. పరిగి నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చి అప్పుడు నియోజవకర్గంలో పర్యటించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కుల్కచర్ల మండల కాంగ్రెస్‌పార్టీ నాయకుల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ కుమార్, అంజలయ్య గౌడ్, ఎంపీటీసీ ఆనందం, జమీల్ తదితరులు పాల్గొన్నారు.