- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌కు 'గాంధీ'ల రిజైన్..? అంతా అబద్ధం: పార్టీ ప్రతినిధి రణదీప్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడ్డ నేపథ్యంలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బాధ్యతలకు 'గాంధీ' కుటుంబం రాజీనామా చేయనున్నట్టు జాతీయ మీడియా సంస్థలు శనివారం కోడైకూశాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్టీకి సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార బాడీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి రిజైన్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పూర్తిగా వైఫల్యం చెందడం పై బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. అంతేకాకుండా, కుటుంబ పార్టీ అనే ముద్రను చెరిపేసి, బీజేపీ విమర్శలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనూ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని వివరించాయి. ఈ మేరకు ఆదివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో వారి నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిపాయి.
ఖండించిన రణదీప్ సూర్జేవాలా
కాంగ్రెస్‌కు 'గాంధీ'లు రాజీనామా చేస్తున్నారనే వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. రాజీనామా వార్తలు పూర్తిగా అబద్ధమని ఖండించారు. 'ఎవరో అనామక వర్గాలు ఇచ్చిన సమాచారంతో 'గాంధీ' లు రాజీనామా చేస్తారంటూ వార్తలు రాయడం అన్యాయం. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు' అని అన్నారు.