Telangana News: మణుగూరులో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

by Nagaya |   ( Updated:2022-04-12 12:47:59.0  )
Telangana News: మణుగూరులో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
X

దిశ, మణుగూరు : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలు గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలను వెంటనే త‌గ్గించాలని కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షుడు గురిజాల గోపి డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐసీసీ, పీసీసీ,డీసీసీ ఆదేశాల మేరకు మండలంలోని పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్ట విజయాగాంధీ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. అనంతరం పెంచిన ధరలు తగ్గించాలని డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే త‌గ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగనాటకం, దొంగ సంతకాలు చేసి ఈనాడు ఢిల్లీలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర పై ధర్నాకు దిగటం సిగ్గుచేటన్నారు.


కేంద్ర ప్రభుత్వం వ‌ర‌స‌గా పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెంచుతుండ‌డంతో ప్రజ‌ల‌పై తీవ్రమైన ఆర్థిక భారం పడిందన్నారు. కేవలం 13 రోజులల్లో 12 సార్లు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచడం దుర్మార్గమన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, అశ్వాపురం మండల నాయకుడు గాదె కేశవరెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, అశ్వాపురం ఎంపీటీసీ పోరెడ్డి విజయలక్ష్మి,, కార్మికశాఖ మహిళా అధ్యక్షురాలు భోగినేని వరలక్ష్మి, యువజన అధ్యక్షుడు కునుసోత్ సాగర్, మండలం ఉపాధ్యక్షురాలు సౌజన్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొమురం రామ్మూర్తి, బీసీ సెల్ అధ్యక్షుడు సాంబశివరావు, బోర్రా భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed