- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూరలో బొద్దింక.. రోడ్డుపై బైఠాయించి ఓయూ విద్యార్థినులు ఆందోళన
దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులకు వడ్డించిన కూరలో బొద్దింక రావడం తో ఆగ్రహించిన విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, అది కూడా సరిపడినంత పెట్టడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. విద్యార్థినులపై ఓయూ అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు . గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థినుల భోజనం పై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. తాజాగా నాణ్యత లేని భోజనం , బొద్దింకల తో కూడిన కూరలు, పాడైపోయిన ఆహారాలను అందజేస్తూ తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వాపోయారు.
తమ ఆరోగ్యం పాడైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమ సమస్యల పై ఎప్పుడు ఆందోళనకు దిగిన, కనీసం అధికారులు స్పందించరని దుయ్యబట్టారు. తాము ఆందోళన ప్రారంభించిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దానిని ముగిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. లేనిపక్షంలో తాము ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.