Flash: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

by GSrikanth |   ( Updated:2022-03-21 12:47:43.0  )
Flash: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. గత ఏడు-ఎనిమిదేళ్లుగా తనకు ప్రశాంత్ కిషోర్‌‌తో ఫ్రెండ్షిప్ ఉందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నాను అని తెలిపారు. రాష్ట్రంలోనూ గత ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడే వారికి మతిలేదని మండిపడ్డారు.



Advertisement

Next Story