- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Acharya: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆచార్య హిందీ రిలీజ్ అప్పుడే?
దిశ, వెబ్‌డెస్క్: 'సైరా' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ ఇచ్చి చేస్తున్న మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్‌కు, సైరా చిత్రంతో మెగాస్టార్‌కు బాలీవుడ్‌లో మాంచి క్రేజ్ లభించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక, ప్రస్తుతం వైరల్‌గా మారిన న్యూస్ ప్రకారం.. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో రిలీజ్ కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ మధ్య తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో డిమాండ్ కూడా పెరిగింది. దీంతో ఆచార్యను కూడా హిందీలో విడుదల చేసేందుకు చిరు ప్లాన్ చేస్తున్నారు. గతంలో గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రీ, ఇంద్ర, స్నేహం కోసం వంటి మెగాస్టార్ సినిమాలు హిందీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీనిపై ఆచార్య చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.