ముచ్చటగా మూడోసారి.. ఫైనల్‌గా హ్యాపీ అంటున్న మోడల్

by sudharani |
ముచ్చటగా మూడోసారి.. ఫైనల్‌గా హ్యాపీ అంటున్న మోడల్
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ మోడల్ క్రిస్సీ టీజెన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు రెండేళ్ల తర్వాత మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపిన ఆమె.. ఇన్‌స్టా వేదికగా బేబీ బంప్ ఫొటోలతోపాటు ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. 'నిజం చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా మా భావోద్వేగాలు అస్పష్టంగా ఉన్నాయి. దీనికి ముందు గర్భం కోల్పోవడం మా జీవితాల్లో విషాదాన్ని నింపింది. కానీ, ఈ వార్త మళ్లీ మా ఇంట్లో సంతోషాన్నిచ్చింది. ఒక మహిళ గర్భం పొందడం అనుకున్నంత సులభమైన ప్రయాణం కాదు. ఏది ఏమైనప్పటికీ మూడో బేబీ గుండె చప్పుడు వినేంత వరకూ కాస్త భయాందోళనకు గురయ్యా. ఫైనల్‌గా హ్యాపీగా ఉన్నాం' అంటూ వివరించింది. ఇక ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకున్న క్రిస్సీ బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది.

Advertisement

Next Story