- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్‌లో మళ్లీ యూనివర్సల్ బాస్ మెరుపులు చూడబోతున్నామా..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మెరుపులు మళ్లీ చూడబోతున్నాం. ఐపీఎల్-2022 సీజన్‌లో గేల్ ఆడటం లేదు. ఈ సీజన్‌లో గేల్ కనీసం మెగా వేలం పాటలో పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో తన కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. కానీ తను మళ్లీ ఐపీఎల్‌లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.
అందలో వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో ఇన్ ప్రిపరేషన్స్ ఫర్ ఐపీఎల్ నెక్స్ట్ ఇయర్.. అనే క్యాప్షన్‌ను ఆ వీడియోకు జత చేశాడు. ఐపీఎల్- 2023 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ కోల్‌కత నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఈ సంవత్సరం మొత్తంగా దూరం అయ్యాడు. మెగా ఆక్షన్‌లో తన పేరును కూడా నమోదు చేయించుకోలేకపోయాడు.
ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 142 మ్యాచ్‌లు పాల్గొన్నాడు. 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తూ 18 వికెట్లు తీసుకున్నాడు.