- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'డాడీ మృతదేహం కోసం కేటీఆర్‌ను వేడుకుంటున్న పిల్లలు'
దిశ, రాజంపేట: పొట్టకూటి కోసం మా డాడీ పొరుగు దేశానికి వెళ్ళాడు.. అక్కడి పరిస్థితులు అనుకూలించక మరణించినట్లు మాకు తెలిసింది.. సార్ మా డాడీ మృతదేహాన్ని మన రాష్ట్రానికి తెప్పించండి, మీ రుణం తీర్చుకుంటాం అంటూ దీనంగా ఆ చిన్నారులు దమ్మాయల వైష్ణవి, వరుణ్ లు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రానికి చెందిన దమ్మాయిల రమేష్..14 నెలల క్రితం ఆర్థిక పరిస్థితులు అనుకూలించక మస్కట్‌కు వెళ్ళాడు. అక్కడ పని చేసే క్రమంలో ఈ నెల 6వ తేదీన ఆయన మరణించినట్లు అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆరు రోజుల నుండి ఇప్పటివరకు మృతదేహం తెలంగాణకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మా డాడీ మాకు కావాలి అంటూ పిల్లలు ఏడుస్తున్న తీరు అందరి మనసులను కుదిపేస్తోంది. ఎంతో మందిని పలు విధాలుగా ఆదుకుంటున్న కేటీఆర్ సార్.. మా డాడీ మృతదేహాన్ని రప్పించాలని పిల్లలు కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఒకవైపు పిల్లలు పడుతున్న వేదన చూసి గ్రామస్తులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ప్రజా ప్రతినిధులు తమ గోడు ప్రభుత్వానికి వినిపించి ఆ మృతదేహాన్ని తెలంగాణకు తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.