- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్నోబిల్ పవర్ లైన్‌పై రష్యా దాడులు: విద్యుత్ సరఫరాకు అంతరాయం
కీవ్: రష్యా సైనిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంటుకు చెందిన హైఓల్టేజ్ పవర్ లైన్ ధ్వంసమైనట్లు గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో అన్నారు. ఇది చెర్నోబిల్ పవర్ ప్లాంటుకు అనుసంధానమై ఉన్న లైన్ అని సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. గ్రిడ్ ఆపరేటర్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించబడకముందే లైన్ మళ్లీ పాడైందని చెప్పారు. దాని మరమ్మతుకు సిబ్బందిలో మళ్లీ రష్యా ఆక్రమిత భూభాగంలోకి వెళతారని చెప్పారు.
అంతకుముందు భద్రతా కారణాలతో ఉక్రెయిన్ ప్రభుత్వమే ప్లాంటుకు విద్యుత్ సరఫరా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులేబా దీనిపై వెంటనే స్పందించారు. చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌కు విద్యుత్ లైన్‌లో మరమ్మతులకు తాత్కలిక కాల్పుల విరమణ చేపట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. విద్యుత్ అంతరాయం కొనసాగితే రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పారు. 1986లో జరిగిన చెర్నోబిల్ ప్రమాదంలో వందల సంఖ్యలో మరణించారు. యూరప్ చరిత్రలో అతిపెద్ద అణు ప్రమాదంగా నిలిచింది.