saffron: ఈ మ్యాజిక్ పువ్వుతో డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి..?

by Anjali |   ( Updated:2025-01-27 13:31:11.0  )
saffron: ఈ మ్యాజిక్ పువ్వుతో డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: డార్క్ సర్కిల్స్(Dark circles) అంటే కళ్ల చుట్టూ కలర్ మారిపోవడం. దీంతో చుట్టుపక్కల స్కిన్ కంటే ముదురు రంగులో కనిపిస్తుంది. ఈ వృత్తాలు, తరచుగా అలసటతో సంబంధం కలిగి ఉంటాయి. నిద్ర లేమి(sleep deprivation), అలసట, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, వృద్ధాప్యం(old age), జన్యుశాస్త్రం, అలెర్జీలు, రక్తహీనత వంటి కారణాల వల్ల ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి.

ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడానికి చాలా మంది అనేక టిప్స్ ఫాలో అవుతుంటారు. పలు ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు.చల్లబడిన రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీలో నానబెట్టిన కాటన్ ప్యాడ్‌లను కళ్లపై పెట్టుకోవడం, ఐస్ ప్యాక్, ఐస్ క్యూబ్‌లను మస్లిన్ గుడ్డలో చుట్టడం, చల్లబడిన దోసకాయ ముక్కలు లేదా రిఫ్రిజిరేటెడ్ (Refrigerated)స్పూన్లను కళ్లపై ఉంచడం వంటివి చేస్తుంటారు.

అయితే ఈ ప్రాబ్లమ్ కు మరో పరిష్కారాన్ని కనిపెట్టారు నిపుణులు. డార్క్ సర్కిల్స్‌ను సహజంగా తగ్గించుకోవాలంటే కుంకుమ పువ్వు(Saffron flower) బెస్ట్ అని సూచిస్తున్నారు. ఈ పువ్వు కేవలం ఆరోగ్యానికే కాదు.. స్కిన్‌కు కూడా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants), యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు(Anti-inflammatory properties) పుష్కలంగా ఉండే కుంకుమ పువ్వు డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. కాగా కుంకుమ పువ్వు బాదం ఆయిల్ కలిపి కళ్ల చుట్టూ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More : పండే కాదు.. గింజలూ అమృతమే.

For More Web Stories : Dishadaily Web Stories

Next Story