- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chay- Shobhitha: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. చైతన్య- శోభిత మ్యారేజ్ డేట్ ఫిక్స్..?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya).. హీరోయిన్ సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్(Engagment) చేసుకొని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఎక్స్(X) వేదికగా ప్రకటిస్తూ చైతన్య- శోభిత నిశ్చితార్ద ఫొటోలను షేర్ చేశాడు. కానీ, పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో అక్కినేని అభిమానులు వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. దీంతో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతూ వచ్చారు. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో డిసెంబర్ 4వ తేదీన మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ తెలుస్తోంది. తాజాగా జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్‌లో ఈ విషయం బయటపడినట్టు సమాచారం. ఇందులో భాగంగా డిసెంబర్ రెండో తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగబోతుందట. అంతేకాదు డిసెంబర్ 10వ తేదీన గ్రాండ్‌గా హైదరాబాదు(Hyderabad)లో భారీ రిసెప్షన్(Reception)ని పెట్టబోతున్నారట. అయితే పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. కానీ, రిసెప్షన్‌కి మాత్రం అటు పొలిటికల్(Political) ఇటు సినీ ఇండస్ట్రీకి(Film Industry) సంబంధించిన ప్రముఖులను పిలవబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.