కన్నుల పండుగగా చక్ర తీర్థ మహోత్సవం..

by Mahesh |
కన్నుల పండుగగా చక్ర తీర్థ మహోత్సవం..
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం) లో నిర్వహిస్తున్న 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం తో పూర్తయ్యాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి త్రిదండి రామానుజ జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో సుదర్శన నారసింహ హోమం, మహా పూర్ణాహుతి, గరుడ పుష్కరిణిలో ఉగ్ర నారసింహ స్వామి కి చక్ర తీర్థ మహోత్సవం జరిపారు.

ఈ చక్రతీర్థ ఉత్సవంలో భక్తులు పాల్గొని పుష్కరిణిలో స్నానం చేసి తరించారు. సాయంత్రం 6 గంటల నుంచి దేవతోద్వాసన, ధ్వజావరోహణం, శ్రీ పుష్పయాగం, సప్తావరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, యువ వికాస్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed