TS Paddy Procurement: అప్పటి వరకు తెలంగాణ బియ్యం కొనేదే లేదు.. కేంద్రం కీలక ప్రకటన

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-20 10:30:41.0  )
Central Government Releases Note On TS Paddy Procurement
X

దిశ, వెబ్‌డెస్క్: Central Government Releases Note On TS Paddy Procurement| ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతోంది. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేయడంపై తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం నుండి బియ్యం సేకరణ నిలిచిపోయేలా పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని కేంద్రం ఆరోపించింది. అన్న యోజన బియ్యం పంపిణీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొంది. బుధవారం కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ఓ నోట్ ను విడుదల చేసింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, తనిఖీ సమయంలో ఈ విషయాన్ని గుర్తించినట్లు కేంద్రం పేర్కొంది. తక్షణమే ఎఫ్ సీఐజేకి తెలంగాణ సర్కార్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. అప్పటి వరకు సెంట్రల్ పూల్ కింద తెలంగాణలో బియ్యం సేకరణ చేపట్టబోమని స్పష్టం చేసింది.

బియ్యం సేకరించాలంటే అన్న యోజన కింద బియ్యం పంపిణీ చేయడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే మిల్లర్లు బియ్యం సేకరించే విధానాన్ని పూర్తి స్థాయిలో ఫాలో కావాలని కేంద్రం స్పష్టం చేసింది. వీటిపైన యాక్షన్ తీసుకుంటూ రిపోర్ట్ ను పంపిస్తే అప్పుడు రాష్ట్రం నుండి బియ్యం సేకరిస్తామని కేంద్రం నోట్ రిలీజ్ చేసింది. ఈ అంశంలో టీఆర్ఎస్ గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి 18 శాతం దెబ్బతిన్న గోధుమల కొనుగోలుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ను ఎందుకు కొనదని ప్రశ్నిస్తోంది. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ఓ మాట చెబితే.. బీజేపీ రాష్ట్ర నేతలు మరో మాట చెబుతున్నారని ప్రశ్నిస్తోంది. తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చేయకుండా కక్ష్యపూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ వాదిస్తున్న తురణంలో కేంద్ర ప్రభుత్వం తాజా నోట్ ను విడుదల చేయడం ఆసక్తిని రేపుతోంది కేంద్రం విడుదల చేసిన తాజా నోట్ పై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

ఇది కూడా చదవండి: అన్ని విశ్వవిద్యాలయాల్లో జాతీయ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలి

Advertisement

Next Story

Most Viewed