'కశ్మీర్‌ఫైల్స్' మూవీపై న్యూజిలాండ్ మాజీ డిప్యూటీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Vinod kumar |
కశ్మీర్‌ఫైల్స్ మూవీపై న్యూజిలాండ్ మాజీ డిప్యూటీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: బాలీవుడ్ మూవీ కశ్మీర్‌ఫైల్స్ సినిమాపై న్యూజిలాండ్ మాజీ డిప్యూటీ ప్రధాని విన్‌స్టన్ పీటర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాను సెన్సార్ చేయడం స్వేచ్ఛపై దాడి చేసినట్లేనని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'కశ్మీర్‌ఫైల్స్ సెన్నార్ చేయడం న్యూజిలాండ్ స్వేచ్ఛపై మరో దాడి. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ల ప్రజలు ఈ సినిమాను చూశారు.


ఈ చిత్రాన్ని సెన్సార్ చేయడం అంటే మార్చి 15న న్యూజిలాండ్‌లో జరిగిన దారుణాల సమాచారం లేదా చిత్రాలను సెన్సార్ చేయడంతో సమానం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకత వస్తుంది. ఎంపిక విధానంలో చిత్రాన్ని సెన్సార్ చేయడం స్వేచ్ఛపై దాడి' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు నేతలు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed