- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
KA Paul: పవన్‌కు ఆకలేస్తే తినేది బీఫ్.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) ఆకలేస్తే.. తినేది బీఫ్ అంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యతో పాటు పిల్లలు కూడా క్రైస్తవులే అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడని అన్నారు. తనకు ఆకలేస్తే బీఫ్ తింటాడని స్వయంగా పవన్ కళ్యాణ్ తనతో చెప్పారంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంట్లో వాళ్ల అమ్మ దీపం వెలిగిస్తే.. వాళ్ల నాన్న దానికి సిగరెట్ వెలిగించుకునే వాడని కూడా చెప్పారని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను మరో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), మణిపూర్ (Manipur)లా కానివ్వబోమని అన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే.. ఇక సామాన్యులుగా పాస్టర్లు ఎలా మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. మత ప్రభోదకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ (Pagadala Praveen) కుటుంబానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) న్యాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందని.. ఒకవేళ ఆలా చేయని పక్షంలో ఆయన ఓ చరిత్ర హీనుడిగా మిలిపోతారని కేఏ పాల్ కామెంట్ చేశారు.