- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని గుర్తించే 'సాలెగూళ్లు'..
దిశ, ఫీచర్స్ : ఎన్నో ఏళ్లుగా 'ప్లాస్టిక్' పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం గానీ ప్రస్తుతం 'మైక్రో ప్లాస్టిక్స్' అందరినీ కలవరపెడుతున్నాయి. మానవ రక్తంలో, ఊపిరితిత్తుల్లో చివరకు పుట్టబోయే శిశువుల మాయలోనూ ఈ అవశేషాలు ఉంటున్నాయి. ఇక తాగే నీరు, తినే ఆహారమే కాకుండా భూగర్భం నుంచి ఎవరెస్ట్ వరకు, లోతైన సముద్రాల నుంచి కురిసే మంచు వరకు ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన ఈ మైక్రో పార్టికల్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవి స్పైడర్ వెబ్స్‌లో కూడా చిక్కుకుంటాయని భావించిన జర్మన్ పరిశోధకులు.. గాలిలోని మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు సాలె గూళ్లు ఒక సాధనంగా ఎలా సాయపడతాయో చూపించారు.
ఓల్డెన్‌బర్గ్‌లోని కార్ల్ వాన్ ఓసిజ్‌కీ యూనివర్సిటీకి చెందిన పర్యావరణ శాస్త్ర విద్యార్థుల బృందం స్థానిక బస్టాప్స్ నుంచి స్పైడర్ వెబ్‌లను సేకరించింది. చిన్న కణాలను ఫిల్టర్ చేసేందుకు, అలాగే సాలెగూళ్లను పరీక్షించేందుకు బృంద సభ్యులు లేబొరేటరీలో పలు టెస్ట్‌లు చేశారు. ఈ మేరకు అన్ని స్పైడర్ వెబ్ నమూనాల్లోనూ మైక్రోప్లాస్టి్క్స్ జాడలు ఉన్నాయని అధ్యయన సహ రచయిత ఇసాబెల్ గోస్మాన్ వెల్లడించాడు. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ కంటెంట్.. వెబ్ మొత్తం బరువులో పదోవంతు కూడా ఉంటుందని తెలిపారు.
పరిశోధకులు మైక్రోప్లాస్టిక్స్ విభాగంలో టైర్ల నుంచి ఉద్భవించే కణాలను గుర్తించారు. అదే విధంగా వస్త్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఫైబర్స్ సహా మసి కణాలను కనుగొన్నారు. దాదాపు 90 శాతం ప్లాస్టిక్‌లో PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్), పీవీసీ, కారు టైర్ల నుంచి వచ్చే పదార్థాలున్నాయని పేర్కొన్నారు. రహదారిపై ఉండే ట్రాఫిక్ ఆధారంగా టైర్ శిథిలాల నిష్పత్తి చాలా మారుతూ ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ పద్ధతి తక్షణం పరిసర గాలిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కంటెంట్‌ను పోల్చడానికి సంక్లిష్ట కొలతలకు సాధారణ ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది. తదుపరి టాక్సికాలజికల్ పరిశోధనల సందర్భంలో ఇది చాలా ముఖ్యమైందిగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
'నమూనా సరళమైనది, ప్రత్యేక నమూనా పరికరాలు కూడా అవసరం లేదు. భూమిపై నుండే దాదాపు ప్రతీ ఆవాసాల్లో సాలెపురుగులు కనిపిస్తాయి. అందువల్ల మైక్రోప్లాస్టిక్స్ కాలుష్యాన్ని గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా సులభంగా యాక్సెస్ చేయగల మాధ్యమంగా స్పైడర్‌వెబ్స్‌ను పేర్కొనవచ్చు' అని పరిశోధకులు బృందం పేర్కొంది.