- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balka Suman కు షాక్.. ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: Case Filed Against Balka Suman in OU PS by OU Student Union Leaders| తెలంగాణలో నరరూప రాక్షసుడు నయీం చనిపోయాడని సంబరపడుతుంటే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రూపంలో ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం మరో నయీం ఇంకా బతికే ఉన్నాడని ఓయూ విద్యార్థి నాయకులు ఆరోపించారు. బాల్క సుమన్, అతడి అనుచరులతో తమకు ప్రాణ హాని ఉందని, ఫోన్ లలో అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారని ఓయూ విద్యార్థి నాయకులు సురేష్ యాదవ్, నవీన్ యాదవ్ లు శనివారం ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నందుకు గతంలో బాల్క సుమన్ తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తాజాగా ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ బెయిల్ మంజూరు విషయంలో ఈటల రాజేందర్ కృషి ఉందని, ఈ విషయంపై తాము మాట్లాడితే బాల్క సుమన్ అతడి అనుచరులతో బెదిరింపులకు బాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అర్థరాత్రులు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ బాల్కసుమన్ ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న తమ ప్రాణాలు తీయాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. తమను బెదిరిస్తున్న బాల్క సుమన్ తో పాటు ఆయన అనుచరులపై కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చెన్నూర్ ప్రజలు ఓ సారి ఆలోచన చేసుకోవాలని, ప్రజల ప్రాణాలు తీసే స్వాభావం ఉన్న బాల్క సుమన్ ను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. త్వరలో ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చెన్నూర్ లో బస్సు యాత్ర నిర్వహించి బాల్క సుమన్ అరాచకాలను నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఎందుకు పెట్టలేదు? షర్మిల పార్టీపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
- Tags
- Balka Suman