సిటీ అవతల సిట్టింగ్.. మైకంలో కత్తితో దాడి చేసిన మిత్రుడు..

by Manoj |
సిటీ అవతల సిట్టింగ్.. మైకంలో కత్తితో దాడి చేసిన మిత్రుడు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ బైపాస్ రోడ్ లో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో రౌడీ షీటర్ లవణ్ కుమార్, అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్టు సీపీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాంనగర్ లో నివాసం ఉండే బోయిని లవణ్ కుమార్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంతో అతనిపై గతంలో పలు కేసులు నమోదు కావడంతో కరీంనగర్ టూ టౌన్ లో రౌడీ షీట్ ఓపెన్ అయిందని పేర్కొన్నారు.

గత కొంతకాలంగా అతను హైదరాబాద్‌లో ఉంటున్నాడని, బుధవారం రాత్రి లవణ్ కుమార్.. అతని మిత్రులతో కలిసి కరీంనగర్ సిటీ అవతల మందు తాగిన మైకంలో అందరూ గొడవపడ్డారని తెలిపారు. ఈ క్రమంలో బోయిని లవణ కుమార్ కత్తితో అఖిల్ అనే వ్యక్తి పై దాడి చేసి గాయపరిచారని వివరించారు. అఖిల్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ -1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ సంఘటనలో ఇప్పటివరకు 8మందిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘర్షణల్లో పాలుపంచుకున్న మిగతా వారిని కూడా గుర్తిస్తామని తెలిపారు.

Advertisement

Next Story