- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీఎస్పీ చీఫ్
లక్నో: రాహుల్ గాంధీని బహుజన్ సమాజ్ పార్టీ ఛీప్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాయవతి స్పందించారు.సొంత పార్టీని సరిగా నిర్వహించలేక బీఎస్పీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ చెప్పినదంతా ఖచ్చితంగా అబద్ధమేనని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలాంటి చిన్న విషయాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. 'కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పడు 100 సార్లు ఆలోచించుకోవాలి. బీజేపీపై వారు గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్న ఎలాంటి ఉపయోగం లేదు' అని చెప్పారు. అంతకుముందు రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమతో పొత్తు కూడితే సీఎం అఫర్ ఇచ్చామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా బీఎస్పీని తక్కువ చేయాలని చూశారని మాయవతి చెప్పారు. 'ప్రస్తుతం ప్రియాంక గాంధీ కూడా నేను ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడుతుందని చెబుతుంది. ఇదంతా నిజం కాదు. మేము వీటిపై సుప్రీంకోర్టులో పోరాడి గెలుస్తామని వారు తెలుసుకోవాలి' అని అన్నారు. కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యాయి.