Sitaphal in Pregnancy: గర్భవతులు సీతాఫలం తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Anjali |   ( Updated:2024-10-21 14:56:59.0  )
Sitaphal in Pregnancy: గర్భవతులు సీతాఫలం తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సీతాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ నడుస్తోంది. దీనిలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం తింటే రోగనిరోధక శక్తికి దోహదం చేస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇన్ని ఉపయోగాలున్న సీతాఫలం గర్భవతులు తినొచ్చా? లేదా అనే సందేహాలు చాలా మందిలో తలెత్తే ఉంటాయి. ప్రెగ్నెన్సీ మహిళలు సీతాఫలం తింటే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా మేలు..

గర్భవతులు సీతాఫలం తింటే తల్లికి, పుట్టబోయే బిడ్డకు లాభాలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు. క్రీమీగా, చాలా తియ్యగా ఉండే ఈ పండు చాలా మందికి ఇష్టం. దీంట్లోని పోషకాలు ప్రెగ్నెన్సీ మహిళలకు బాగా ఉపయోగపడతాయి. పిండం ఎదుగుదలకు సీతాఫలం ఎలాంటి లోపాలు రాకుండా చేయడంలో మేలు చేస్తుంది. అలాగే ఈ పండులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యల్ని తరిమికొడుతోంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మెగ్నీషియం బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో తోడ్పడుతుంది.

ఈ సమస్యను దూరం చేస్తుంది..

సాధారణంగా గర్భవతులు వాంతులు చేసుకుంటారు. కాగా సీతాఫలం తింటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిలో ఉండే విటమిన్ బి6 ఈ బాగా మేలు చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతో గర్భవతుల్లో ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది. డయేరియా వంటి సమస్యలు దూరం అవుతాయి. కానీ సీతాఫలం మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ సీతాఫలం తిన్నాక కొంతమందికి ఎలర్జీలు, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను అప్రోచ్ అవ్వండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story