'మన రాజ్యం మనమే ఏలాలి'.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Manoj |
మన రాజ్యం మనమే ఏలాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ: మన రాజ్యాన్ని మనమే ఏలుకోవాలని, తన 22 రోజుల యాత్రలో.. ప్రతి పీడిత గుండెను స్పృశించామని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం నల్లగొండ నియోజకవర్గానికి చేరుకుంది. అన్నెపర్తి గ్రామం ఆ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ మండలంలోని వెలిమినేడు గ్రామంలో ప్రభుత్వం 600ల ఎకరాల భూమిని కబ్జా చేసిందని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన అగ్రవర్ణ పేదలు కూడా బహుజనులేనని చెప్పారు. 99 శాతం ఉన్న పీడిత వర్గాలను 1 శాతం ఉన్న జనాభా ఏలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనతో ఓట్లు వేయించుకున్న అగ్రవర్ణాల నేతలు, సీఎం దగ్గర కూర్చుని కాంట్రాక్టులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధుపై సీఎం ఇప్పటివరకు ఒక్క ప్రకటన చేయలేదని, ధరణిలో పేదల భూములు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని, ఆసుపత్రుల్లో మందులు లేవని ఆరోపించారు. జనాభా నిష్పత్తి ప్రకారమే సంపద ఉండాలని, విద్యా, వైద్యం ఉచితంగా అందాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని కోరారు. అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే బీఎస్పీ ప్రతి బహుజనుడి వద్దకు చేరుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నల్లగొండ ఇంచార్జ్ ఒంటెపాక యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Next Story